VZM: మెరకముడిదాంలో పొగమంచు అధిక స్థాయిలో కురుస్తోంది. ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనబడనంతగా మంచు తెరలు కమ్మేశాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఉదయాన్నే పొల పనులకు వెళ్లే రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు ఎక్కవగా ఉండడంతో చలితో స్థానికులు గజగజ వణుకుతున్నారు. కొందరు చలిమంటలు వేసుకొని కాస్త ఉపశమనం పొందుతున్నారు.