BHNG: ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బోడ సుదర్శన్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వేములకొండలో జరిగిన సుదర్శన్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం సాగించిన ఆయన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. సభలో పల్లా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, దామోదర్ రెడ్డి, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.