NDL: కొత్త ఏడాది సందర్భంగా ఇవాళ తెల్లవారుజామునుంచే శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను ఆలయ అధికారులు రద్దు చేశారు. మల్లన్న అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు.