ATP: తాడిపత్రిలోని చారిత్రాత్మక శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 1 సందర్భంగా గురువారం ఉదయం స్వామివారికి అర్చకులు విశేష అభిషేకాలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు.