కృష్ణా: మచిలీపట్నం-నూజివీడు జాతీయ రహదారిపై పెడన మండలం కొంకెపూడి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లవల్లేరు మండలానికి చెందిన వెంకటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరమ్మ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.