GDWL: గద్వాల పట్టణంలోని రెండో రైల్వే గేటు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని మహిళ (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ అశోక్ కుమార్ వివరాలు.. మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఆమె కాచిగూడ-గుంటూరు రైలు కింద పడి ప్రాణాలు వదిలినట్లు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8341252529 నంబరుకు సమాచారం అందించాలన్నారు.