WGL: నూతన సంవత్సరం వేడుకలలో వర్ధన్నపేట పట్టణంలో పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, ప్రధాన జంక్షన్లు, వీధులపై గస్తీ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు గురువారం సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.