ADB: తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉట్నూర్ మండలం హస్నాపూర్లో మృతి చెందాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాథోడ్ సాయికిరణ్ (27) డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా బాధపడుతూ.. అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.