KRNL: ఆదోని మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం తీవ్ర వాగ్వాదాలతో వాయిదా పడింది. వైస్ ఛైర్మన్ నరసింహులు, కమిషనర్ కృష్ణల మధ్య ఘర్షణ నెలకొంది. సమావేశాల నిర్వహణ రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు బుధవారం సూచించారు. బడ్జెట్ సమావేశాలను ఆషామాషీగా వాయిదా వేయరాదని స్పష్టం చేస్తూ సభను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.