కృష్ణా జిల్లాలో 2024–2025 సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో నమోదయ్యాయి. ప్రాణాంతక ప్రమాదాలు 309 నుంచి 368కి పెరిగి 19 శాతం వృద్ధి చూపించాయి. ఈ ప్రమాదాల్లో మరణాలు 338 నుంచి 394కు చేరాయి. మరోవైపు ప్రాణాంతకం కాని ప్రమాదాలు 463 నుంచి 411కి తగ్గి 11 శాతం తగ్గుదల నమోదైంది. వాటిలో గాయపడిన వారి సంఖ్య 722 నుంచి 713కు స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు.