E.G: నిడదవోలు తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం అసంపూర్తి భవనం వద్ద నిరసన చేపట్టారు. 2018లో రూ.50 లక్షలతో ప్రారంభించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాత భవనంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసి భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరారు.