SKLM: భూములకు సంబంధించి రీ సర్వే పూర్తయిన గ్రామాలలో శుక్రవారం నుంచి పాత పాస్ పుస్తకాలు స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని సంతబొమ్మాళి తహసీల్దార్ హేమసుందరరావు తెలిపారు. ఈనెల 9 వరకు రెవిన్యూ గ్రామ సభల ద్వారా అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఆయా VROలకు సమాచారం ఇచ్చామన్నారు.