కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును ఎంపీడీవో ఎండీ ఇమ్రాన్ నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక రోజు ముందే పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.