MDCL: ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలోనే డిగ్రీ కళాశాల ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సుమారుగా 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సొంత భవనం నిర్మించి, మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు. దీంతో కనీసం ల్యాబ్లు లేక విద్యార్థులు సాంకేతిక నైపుణ్యంలో వెనుకబడుతున్నారు. ఉన్న వసతులతో అధ్యాపకులు వివిధ రకాల స్కిల్ ట్రైనింగ్ కోర్సులు అందిస్తున్నారు.