CTR: గ్రామాల్లో పారిశుధ్య చర్యల కోసం ప్రభుత్వం స్వచ్ఛ రథం ద్వారా చర్యలు చేపట్టనుంది. స్వచ్ఛరథం ఆపరేటర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. మొదటి దశలో బంగారుపాళ్యం, చిత్తూరు రూరల్, ఐరాల మండలాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఇంటింటా సేకరించిన స్క్రాప్ తరలించి విక్రయించుకోవచ్చన్నారు.