GDWL: నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దు అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం రాత్రి ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు పండుగలు, వేడుకల సమయంలో ఇలాంటి ఆకర్షణీయమైన ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తారని వివరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 సంప్రదించాలన్నారు.