NLR: కలిగిరిలో లక్షలు వెచ్చించి కొన్న స్వచ్ఛ ఆంధ్ర చెత్త సేకరణ వాహనం మూలనపడి తుప్పు పడుతోంది. దీని మరమ్మతులకు రూ.90 వేలు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. వాహనం లేక చెత్త సేకరణ 2,3 రోజులకు ఒకసారి జరుగుతుండటంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. నిధుల కోసం నివేదిక పంపామని, త్వరలో బాగుచేయిస్తామని డిప్యూటీ ఎంపీడీవో తెలిపారు.