కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ వద్ద బుధవారం పోలీసులు పేకాట శిబిరంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో రహస్యంగా పేకాట ఆడుతున్న 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.