SRPT: గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించి గ్రామాభివృద్ధికి తోడ్పాటు నందించాలని రామన్నగూడెం గ్రామ నూతన సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన పాలకవర్గంతో కలిసి ఎంపీడీఓ పల్లపు ఝాన్సీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.