GDWL: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గద్వాల పోలీస్ అధికారులకు నూతన సంవత్సరం పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పతకాలను ప్రకటించింది అని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఉత్తమ సేవ పతకానికి ఎస్సై చంద్రశేఖర్, సేవ పతకాలకు ఏఎస్సైలు ప్రసాద్, ప్రేమ్ కుమార్లు ఎంపికయ్యారు. ఎస్పీ వారిని అభినందించారు.