ASR: హుకుంపేట మండలం సంతారి, ఉప్ప మీదుగా దేవరాపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని రాపా ఎంపీటీసీ కె.బి.సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాల వల్ల రోడ్డు పూర్తిగా శిథిలమై రాళ్లు తేలడంతో, 16 పంచాయతీల పరిధిలోని 156 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆమె కోరారు.