KRNL: యూరియాను అధిక ధరలకు విక్రయించరాదని ఎమ్మిగనూరు వ్యవసాయ అధికారి శివశంకర్ ఎరువుల డీలర్లను బుధవారం హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్లను అప్డేట్ చేయాలని, యూరియా లభ్యతను బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి అనుగుణంగా మాత్రమే ఎరువుల విక్రయాలు చేయాలని తెలిపారు.