VSP: న్యూఇయర్ వేడుకల వేళ విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సరికొత్త ఆలోచన చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది పూల బొకేలు, స్వీట్లు కాకుండా పేదలకు, అనారోగ్య బాధితులకు ఉపయోగపడే విధంగా నెలకొల్పిన సంజీవని నిధికి విరాళాలు అందించాలని ఆయన సూచించారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి అందుబాటులో ఉంటారు.