ELR: టి. నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో నిన్న రాత్రి నూతన సంవత్సర వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరంగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరం అందరికీ మంచి కలగాలని ఆకాంక్షించారు.