NZB: స్టేట్ టీచర్స్ యూనియన్ 2026 క్యాలెండర్ను ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి శివలింగప్ప బుధవారం ఆవిష్కరించారు. ఎడపల్లి స్టేట్ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూపతి, NZB జిల్లా స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు సురేందర్, ఖాదీర్ పాల్గొన్నారు.