HYD: కేబీఆర్ పార్క్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ అక్కడికి చేరుకుని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వేడుకల వేళ ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.