MBNR: సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని, పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు, స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చే అందరూ సమిష్టిగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.