కృష్ణా: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో బుధవారం రాత్రి మాట్లాడుతూ.. గడిచిన ఏడాదిలో ప్రజలు ఐక్యంగా ఎంత అభివృద్ధి సాధించవచ్చో చూపించారని, ప్రజల్లో వచ్చిన మార్పు చూసి తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.