NGKL: అమ్రాబాద్ నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతంలో దోపిడీ దొంగలు ఉన్నారన్న ప్రచారం అవాస్తవమని అచ్చంపేట DSP పల్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులు, పర్యాటకులకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. ఫిర్యాదులు లేకుండా భయాందోళనలు సృష్టించడం తగదని, ఎలాంటి ఆపోహలు లేకుండా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు.