E.G: కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.