ATP: తాడిపత్రి నియోజకవర్గాన్ని నందన వనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గురువారం గాంధీ సర్కిల్లో దీక్ష చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం కనుక్కోవడానికి దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడచుకోవాలనేదే తమ అభిప్రాయం అని అన్నారు.