ELR: చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.