PPM: కనీసం రైతులకి గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని EX Dy.CM పాముల పుష్ప శ్రీ వాణి అన్నారు. శుక్రవారం కొమరాడ (M) విక్రంపురంలో కల్లాల్లో ధాన్యం ఆరబోసుకొని ఉంటే ప్రభుత్వం ఎటువంటి గోనె సంచులను ఇవ్వలేదని దీని వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆమెకు తెలిపారు. రైతుల సమస్యపై కలెక్టర్ స్పందించాలని కోరారు.