AP: రాష్ట్రంలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 85,870 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 16 నెలల్లో మొత్తం రూ.8.08 కోట్ల పెట్టబడులు తీసుకొచ్చినట్లు చెప్పారు. క్లస్టర్ వారీగా పారిశ్రామికాభివృద్ధి చేస్తామన్నారు. 3 మెగాసిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.