VSP: షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.