AP: పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కరవును శాశ్వతంగా నివారించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.