CTR: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి MLA వినతులు స్వీకరించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు.