CTR: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ మేరకు కార్వేటి నగరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇందులో భాగంగా సమస్యలపై బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.