NRML: ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు సందర్బంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.