రష్మిక, రక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ చిత్రం ఇవాళ థియెటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి రుజువుచేశారని తెలిపాడు.