MNCL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అధికారులు తక్షణమే పర్యవేక్షించాలని బెల్లంపల్లి TDP పట్టణ అధ్యక్షుడు మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాట్లాడుతూ.. ఇల్లు ఇప్పిస్తామని రూ.70 వేలు డిపాజిట్ చేయాలని అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన పేదవారికి ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.