VZM: స్థానిక మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో సీజనల్‌గా డిమాండ్ ఉన్నటువంటి పూల తోటల పెంపకం, అరటి తోటలు, బొప్పాయి, పుట్టగొడుగులు, ఆకు కూరలు తదితర పంటల విస్తీర్ణాన్ని పెంచడంపై ఉద్యాన అధికారులు దృష్టి సారించాలన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు.