ADB: సోయాబీన్ పంట కొనుగోలులో అధికారులు పంటరంగు మారిందని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ జాగృతి నాయకుడు వేణుగోపాల్, బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి సమస్యను వివరించారు. అధికారులు పంటను ప్రైవేటుకు అమ్ముకోవాలని రైతులకు సూచించడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.