KKD: అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ‘ప్రభుత్వం – సుపరిపాలన’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు అవగాహనతో కూడిన బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.