బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. పండంటి మగబిడ్డకు కత్రినా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, విక్కీ, కత్రినా 2021లో పెళ్లి చేసుకున్నారు.