ASF: అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని FRO మజారుద్దీన్ అన్నారు. రేంజ్ పరిధిలోని జైనూర్లో శుక్రవారం ఫారెస్ట్ బీట్లను సందర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించుకోవాలన్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేసినా, కరెంటు తీగలను అమర్చినా అటవీ చట్టాల ప్రకారం శిక్షలు తప్పవన్నారు.