HYDలోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలవరం అథారిటీ భేటీ అయింది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు ప్రతినిధులు, తెలంగాణ తరపున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. త్రిసభ్య కమిటీ రూపొందించిన ఎంవోను ఆమోదించబోతున్నట్లు సమాచారం.