TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బాకీల పేరుతో బీఆర్ఎస్ కావాలని బట్టకాల్చి కాంగ్రెస్ మీద వేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారమన్నారు. తాము కబ్జాదారుల పైకి బుల్డోజర్లు పంపిస్తే.. వారు ఖజానాపైకే బుల్డోజర్ పంపించారన్నారు.