తరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు, టీటీడీ ఉన్నతాధికారులు ఆహ్వానించారు. వారికి ఆహ్వాన పత్రికను అందజేసి వేద ఆశీర్వచనాన్ని అందించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.