ELR: ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి నగర పంచాయతీ బాలికల ఉన్నత స్కూల్ వద్ద నుంచి గురుబట్లగూడెం వరకు 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేశారు.